రిలీవ్ అయిన స్కూల్ అసిస్టెంట్ టీచర్లు
నిజామాబాద్ జూన్ 8 ధ్వని న్యూస్ జిల్లా ప్రతినిధి :ఉమ్మడి జిల్లాలో ఏడు నెలల క్రితం బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్ టీచర్లను శనివారం రిలీవ్ చేశారు. సుదీర్ఘ కాలం విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు గత ఏడాది అక్టోబర్లో జరిగాయి. వివిధ కారణాల వల్ల వారిని పాత పాఠశాల నుంచి రిలీవ్ చేయలేదు. ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం లేదు. ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. కాగా వారిని నేడు రిలీవ్ చేయడంతో హర్షం వ్యక్తం చేశారు.