రాష్ట్ర ఆర్థిక సంఘంతో కర్ణాటక ఆర్థిక సంఘం భేటి

0

aardhika

స్థానిక సంస్థల పని తీరుపై భేటి

స్థానిక సంస్థల బలోపేతానికి నిర్ణయం

సమీక్ష లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక సంఘం

చైర్మన్ రాజయ్య,ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్

పాల్గొన్న కర్ణాటక ఆర్థిక సంఘము చైర్మన్ నారాయణ స్వామి,సభ్యులు

యం.డి సమెల్ల,ఆర్ యస్ పాండే లు

హైదరాబాద్(ధ్వనిన్యూస్);స్థానిక సంస్థల బలోపేతానికి పరస్పరం అవగాహన పెంపొందించు కునేందు తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాలు దృష్టి సారించాయని తెలంగాణా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కర్ణాటక రాష్ట్ర ఆర్ధిక సంఘం చైర్మన్ యం డి సమెల్ల,ఆర్ యస్ పాండేలు పేర్కొన్నారు.రాష్ట్రంలో స్థానిక సంస్థల పనితీరు పరిశీలన తో పాటు స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిశీలించేందుకు గాను కర్ణాటక ఆర్థిక సంఘం చైర్మన్ నారాయణ స్వామి,సభ్యులుయం.డి సమెల్ల,ఆర్ యస్ పాండే  ఆధ్వర్యంలో ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది.అందులో భాగంగా హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కాలనీ లోని రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యాలయంలో రెండు రాష్ట్రలకు చెందిన ప్రతినిధుల బృందం సమావేశమై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.రాష్ట్ర ఆర్ధిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సభ్యులు సంకేపల్లి సుదీర్ రెడ్డి,మాలోతు నెహ్రు నాయక్,యం రమేష్ లతో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ లు పాల్గొన్నారు.అదే విధంగా కర్ణాటక రాష్ట్రం నుండి ఆ రాష్ట్ర చైర్మన్ నారాయణ స్వామి సభ్యులు యం.డి సమెల్ల, ఆర్ యస్ పాండే తదితరులు పాల్గొన్నారు.కర్ణాటక లో స్థానిక సంస్థల పని తీరును వివరించడంతో పాటు ఆర్థిక పరిపుష్టికి ఆ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు కర్ణాటక ఆర్థిక సంఘము చైర్మన్ వివరించారు.అదే విదంగా తెలంగాణా లో స్థానిక సంస్థల పని తీరును తెలుసు కోవడం తో పాటు ఆర్ధికంగా బలోపేతానికి తీసుకుంటున్న చర్యలు విషదీకరించారు.ఇతర రాష్ట్రాలలో కుడా పర్యటించి రెండు రాష్ట్రాలలో స్థానిక సంస్థల పని తీరును మెరుగు పరిచేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలను రెండు రాష్ట్రాల ప్రతినిధుల బృందం పరస్పరం చర్చించుకొని ఒక అవగాహన కు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *