బొంతపల్లిలో బడిబాట ర్యాలీ
గుమ్మడిదల,ధ్వని న్యూస్:సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారం బొంతపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల అందిస్తున్న విద్య బోధన సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరిస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ రాంబాబు, ఉపాధ్యాయులు ప్రసాద్,శర్మ, అజిముద్దీన్, శ్రీనివాస్ గౌడ్ వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు సరెడ్డి గారిబిక్షపతి రెడ్డి, పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.