ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు
కల్వకుర్తి మండలం సంజాపూర్ గ్రామానికి చెందిన దొడ్ల శ్రీహరి ప్రమాదవశాత్తు కొన్ని రోజుల క్రితం మృతి చెందిన విషయాన్ని తెలుసుకొన కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్,కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 8000/-వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.అలాగే కాంగ్రెస్ పార్టీ మృతుని కుటుంబాన్ని అండగా ఉండి,అన్నివేళలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంజాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.