నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ చే విచారణ జరిపించాలి
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆకాష్ నాయక్
ధ్వని న్యూస్ /షాద్ నగర్:దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వెలువడుతున్న తరుణంలో పరీక్ష నిర్వహించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆకాష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 5 న నిర్వహించిన పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, ప్రకటించిన ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానాలకు సజీవ సాక్ష్యం ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం మరల వారి యొక్క పరీక్ష కేంద్రం ఒకటే కావడం వలన వారి అనుమానాలకు బలాన్నిస్తుందన్నారు. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి పరీక్ష రాసిన మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై, పేపర్ లీకేజీ లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఆకాష్ నాయక్ డిమాండ్ చేశారు లేని యెడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు