గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలను పరిశీలన కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ ధ్వని న్యూస్(జిల్లా ప్రతినిధి) మెదక్ పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల,సిద్ధార్థ మోడల్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు టిజిపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రూప్ -1ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తీరును, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు.బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల హాజరును,పరీక్ష కేంద్రంలోని సీసీటీవీల పనితీరును చూశారు.రోల్ నెంబర్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.పరీక్ష కేంద్రంలో ఉన్న మౌలిక వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని,ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని ఇన్విజిరేట్లరకు సూచించారు.144 సెక్షన్ అమలును, మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో చీఫ్ సూపరెంటెండెంట్లు, ఇన్విజిలేటర్లు ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.