గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కు నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు…

0

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల ప్రతినిధి-ధ్వని న్యూస్:జిల్లాలో నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా , కమీషన్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు.పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్, పరిశీలకులను నియమించడం జరిగిందని అన్నారు.జిల్లాలో 22 కేంద్రాల్లో 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష హాలులోకి ఉదయం 9.00 గంటలకు నిశిత పరిశీలన చేస్తూ కేంద్రం లోకి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 గంటలకు మెయిన్ ద్వారం మూసి వేయడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులను బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష నిర్వహణకు ఏ ఒక్క పొరపాటుకు తావివ్వకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.పరీక్ష నిర్వహణకు 386 ఇన్విజిలేటర్లు ,22 చీఫ్ సూపరింటెండెంట్, 22 డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 5 ఫ్లై ఇంగ్ స్వాడ్ 5 టీమ్స్, 77 మంది బయో మెట్రిక్ ఆఫీసర్లు, 4 రూట్ అధికారులు,119 మంది ఐడెంటిఫికేషన్ అధికారులు,154 మంది పోలీసు సిబ్బందిని నియమించడం జరిగిందని, వారికి కేటాయించిన విధులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నియమ నిబంధనల మేరకు నిర్వహించదం జరుగుతుందని తెలిపారు.అభ్యర్థులు చేయదగినవి, చేయకూడనివి అంశాల బ్యానర్లు ప్రతీ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగాయని తెలిపారు.విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు పంపిణీ చేశామని తెలిపారు.కమీషన్ నిబంధనలో పేర్కొన్న గాడ్జెస్ లను కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు. అభ్యర్థులు ఒక గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, వివిధ ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థుల సౌకర్యం కోసం ముందస్తు సమయానికి బస్సు లు నడిచెవిదంగా ఏర్పాట్లు ఆర్టీసీ చేస్తుందని, పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్ష కేంద్రాలలో మెడికల్ టీమ్ లు ఏర్పాటు చేయాలని, త్రాగునీరు తదితర సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు.నిర్ణీత సమయాల్లో క్వశ్చన్ పేపర్, ఓ.ఏం.ఆర్.షీట్లు పంపిణీ చేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలోనికి ఏ వాహనాలను అనుమతించకూడదని, బయట పార్కింగ్ చేయాలని అన్నారు.పరీక్ష కేంద్రాల వద్ద 144 విధించడం,పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేయడం జరుగిందని తెలిపారు.సెల్ ఫోన్స్,గాడ్జేస్ అనుమతించబోమని తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ పరీక్షల నిర్వహణకు నోడల్ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, పోలీసు నోడల్ అధికారిగా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ లను నియమించామని కలెక్టర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *