గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత కంటి వైద్యం.. ప్రజలు అవకాశాలను వినియోగించుకోవాలి
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకి రెడ్డి
వంగూరు(ధ్వని న్యూస్ ప్రతినిధి):-వంగూర్ మండలం పోల్కంపల్లి గ్రామంలో శంకర్ నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిక్ చెన్నై సంస్థ నుండి నరేందర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి అధ్వర్యంలో ఈ కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.తేదీ: 08-06-2024 నుండి 18-06-2024 తేదీ వరకు శిబిరం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.రెండు రోజుల్లో 350 మందికి పరీక్షలు నిర్వహించి,70 మందికి సర్జికల్ కంటి శుక్లాల ఆపరేషన్ మొబైల్ బస్ లో నిర్వహించామని డాక్టర్స్ శంకర్,అరుణ్ కుమార్ తెలిపారు.ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సందర్శించారు.కంటి పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.గ్రామ ప్రజలను ఆప్యాయతగా పలకరించారు.ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న నరేందర్,శ్రీకాంత్ లను అభినందించారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు సుంకిరెడ్డి ప్రసాద్ రెడ్డి,రాధా కృష్ణ,సుధాకర్ రెడ్డి,బొజ్జ రాంకుమార్ రెడ్డి,బాలయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.