విశ్వహిందూ పరిషత్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా , గోవింద నామాలు భజన కార్యక్రమం
ఖమ్మం (ధ్వని న్యూస్ ప్రతినిధి) : విశ్వహిందూ పరిషత్ ఖమ్మం శాఖ అయోధ్య రాముని కృపతో ఒక సంకల్పం తీసుకుంది . మొన్న హనుమజ్జయంతి నుంచి వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి వరకు ఒక సంవత్సర కాలంలో మన జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో హనుమాన్ చాలీసా , గోవింద నామాల పారాయణం జరగాలని సంకల్పం పెట్టుకుంది . ఆ సంకల్ప సందర్భంగా మొట్ట మొదటిసారిగా ఈరోజు ఎన్ఎస్పి రామా లయమ్ లో ఈ కార్యక్రమం ప్రారంభం చేసింది . ఎన్.ఎస్.పి రామాలయానికి దాదాపుగా 250 మంది భక్తుల తోటి హనుమాన్ చాలీసా గోవింద నామాల పారాయణం దిగ్విజయంగా జరిగింది . ఈ సంకల్పం గురించి ప్రతి ఇంటిలో ఇదేవిధంగా చాలీసా గోవింద నామాల పారాయణం జరుపుటకు అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది . చాలామంది భక్తులు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం బాగుందని , ప్రతి ఇంటిలో జరుపుటకు ముందుకు వచ్చారు హిందూ బంధువులందరికీ మా విన్నపం ఏమనగా ప్రతి ఇంటిలో ఈ పారాయణం జరగాలని కోరుతున్నాము .ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా , మండల సభ్యులు , తిరుమల తిరుపతి సేవా బృందాలు , భక్త బృందాలు పాల్గొన్నారు .