నాదెండ్ల మనోహర్ కి అభినందనలు తెలియజేసిన ఉప్పు వెంకటరత్తయ్య

0

హైదరాబాద్, జూన్ 8(ధ్వని న్యూస్): శనివారం ఉదయం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం శాసనసభ్యలు జనసేన పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయటం జరిగినది.గతంలోనూ తెనాలి శాసనసభ్యునిగా పెండింగ్ పనులను , ఏన్నో మంచి కార్యక్రమాలను తన హయాంలో పూర్తి స్థాయిలో పనిచేసిన ఘనత మనోహర్ గారికే చెందుతుందని ఉప్పు వెంకటరత్తయ్య అన్నారు. తెనాలి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజలు , జనసేన , తెలుగుదేశం, బిజెపి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు బాగా శ్రమించి అధ్బుతమైన గోప్ప విజయాన్ని అందించిన అందరికీ ఈసందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తేలియజేయుచున్నాను. సమస్యలపై అవగాహన వుండిన ప్రజలమనిషి అయిన నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్యారీస్ తెనాలి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని వెంకటరత్తయ్య అన్నారు.ఈకార్యక్రమంలో జనసేన పార్టి గుంటూరు జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్, పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, పట్టణ కార్యదర్శి పావులూరి కోటేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉపేంద్ర , డివిజన్ అధ్యక్షులు అంబటి కుమార్, తోటకూర విజయ్, కన్నసాని రాజా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *