హైదరాబాద్,(ధ్వని న్యూస్) కేంద్రమంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి ఇద్దరి చోటు దక్కనుంది. భాజపా ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం లభించనుంది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి వారికి సమాచారం వచ్చింది. దీంతో వారిద్దరూ దిల్లీకి బయల్దేరారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.