ఆదిభట్ల మున్సిపాలిటీలో సిసి రోడ్డు ప్రారంభం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీలోని 2వ వార్డు వేధ పూరి కాలనీలో 7 లక్షల రూపాయలు,11వ వార్డులో బాలాజీ నగర్ కాలనీ లో 15 లక్షల రూపాయల నిధులతో ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి,కౌన్సిలర్లు మర్రి అర్చన రామ్ రెడ్డి, కుంట్ల మౌనిక ఉదయపాల్ రెడ్డితో కలిసి సిసి రోడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దిశలవారీగా ఆదిభట్ల మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు తన శాయ శక్తుల కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిభట్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కామన్ల యాదగిరి, అధికారులు, ఏ ఈ వీరాంజనేయులు, వర్క్ ఇన్స్పెక్టర్ జాన్సన్, స్థానిక నాయకులు పైల శ్రీనివాస్ రెడ్డి, పాతూరు వెంకటేష్ గౌడ్, అట్లూరి రామారావు, ప్రభాకర్ రెడ్డి, కావేటి కృష్ణ, పాండు గౌడు, ప్రవీణ్ గౌడ్, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.